కోవిడ్ వారియర్ అవార్డు అందుకున్న అంగటి రమేష్, పార్వతి దంపతులు
రాజమహేంద్రవరం, ఆగస్టు 6 2020, కరోనా కష్టకాలంలో నిరుపేదలకి సహాయ కార్యక్రమాలు చేసిన వారికి అన్నామినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మదర్ సోలఫ్రిడ్ పుట్టినరోజు సందర్భంగా 2020 కోవిడ్ వారియర్ అవార్డులను అందచేశారు. రావులపాలెం మండలం ఊబలంక అన్నా మినిస్ట్రీ రాష్ట్ర ప్రదాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 23 మందికి వివిధ కేటగిరిల్లో విశిష్టమైన సేవలు అందించిన వారికి సంస్థ చైర్మన్ బిషప్ పి జాషువా డానియల్ చేతుల మీదుగా అవార్డులు అందచే శారు. లాక్డౌన్ కాలంలో తమ సొంత డబ్బులతో నిరాశ్రయుల కు, వలస కార్మికులకు, యాచకులకు 50 రోజుల పాటు నిరంతరాయంగా ఆహారం అందించంటంతో పాటుగా యాచకులకి క్షురకర్మలు చేయించి కొత్త బట్టలు ఇచ్చిన రాజమహేంద్రవరంకి చెందిన ఎస్ఐసి ఉద్యోగి అంగటి రమేష్, పార్వతి దంపతులకి కోవిడ్ వారియర్ అవార్డును అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు రాష్ట్ర కార్యదర్శి కె.వి. శేఖర్, గౌరవ సలహాదారు ఐ.ఈ.కుమార్, అడ్మినిస్ట్రేటర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.